Share News

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఖానిస్థాన్ సంచలనం

ABN , Publish Date - Nov 02 , 2026 | 09:11 PM

ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ ప్రస్థానంలో అరుదైన మైలు రాయిని అందుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్‌లో ఆ జట్టు ఆరో స్ధానానికి చేరుకుంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఖానిస్థాన్ సంచలనం
Afghanistan ODI Rankings

స్పోర్ట్స్ డెస్క్: ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ ప్రస్థానంలో అరుదైన మైలు రాయిని అందుకుంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్‌లో ఆఫ్ఘానిస్థాన్ ఆరో స్ధానానికి చేరుకుంది. శ్రీలంకను వెనక్కి నెట్టి మరీ అత్యుత్తమ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘనతతో ఆఫ్ఘానిస్థాన్‌.. ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి బ‌ల‌మైన జట్ల కంటే మెరుగైన స్థానంలో నిలిచింది.


ఆఫ్ఘానిస్థాన్ ఖాతాలో ప్రస్తుతం 94 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు గత కొంత కాలంగా వన్డే ఫార్మాట్లలో చక్కగా రాణిస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 191 వన్డేల్లో 96 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రధానంగా 2023 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లపై చిరస్మరణీయ విజయాలు సాధించింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలానే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తో ఆఫ్ఘాన్‌ వైట్‌వాష్ చేసింది.


ఐర్లాండ్ పర్యటనలో ఐదు మ్యాచుల వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లను గెలుచుకోవడమే కాకుండా.. జింబాబ్వే, బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శనల కారణంగానే వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘాన్ జట్టు ఉత్తమ ర్యాంక్ సాధించింది. కాగా వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్ధానాల్లో భారత్‌, న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

Updated Date - Nov 02 , 2026 | 09:25 PM