సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు
ABN , Publish Date - Nov 02 , 2026 | 08:40 PM
సింగరేణికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. సింగరేణికి చెందిన ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐదు గనులకు అత్యున్నత రేటింగ్ దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: సింగరేణికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. సింగరేణికి చెందిన ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐదు గనులకు అత్యున్నత రేటింగ్ దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే అవార్డులు అందజేశారు. ఆయన చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి అవార్డులు అందుకున్నారు. శ్రీరాంపూర్ – ఆర్‌కేఎన్‌టీ, ఆర్‌కే-6 ఇంక్లైన్, సత్తుపల్లి – జేవీఆర్ ఓసీ-2, బెల్లంపల్లి – ఖైరీగూడ ఓసీ, రామగుండం-3 – ఆర్‌జీఓసీ-1 గనులను ఆ అవార్డులకు ఎంపిక చేశారు. భద్రత, పర్యావరణ పరిరక్షణ, కార్మిక సంక్షేమం సహా 84 అంశాల ఆధారంగా మూల్యాంకనం చేసి ఆ అవార్డులను అందించారు. 100 మార్కులకు 91కి పైగా సాధించిన గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. మరిన్ని అవార్డులు సాధించేలా పనిచేయాలని కార్మికులకు వారు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా
తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలిస్తాం.. మహా పాదయాత్రలో అమిత్ షా