చౌటుప్పల్‌లో జోగిని హత్య కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:24 PM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న పవన్, హర్షిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
యాదాద్రి, నవంబర్ 11: జిల్లాలోని చౌటుప్పల్‌లో జోగిని సుధాకర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న పవన్, హర్షిత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,319 గ్రాముల బంగారం, 3.600 కిలోల వెండి, రూ.9లక్షల నగదుతోపాటు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి.. విచారిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. జోగిని సుధాకర్ అసలు పేరు రాళ్లబండ సుధాకర్, అతడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక. సుధాకర్.. జోగినిగా, పండుగల సమయంలో పూజారిగా పని చేస్తూ చౌటుప్పల్‌లో నివసిస్తున్నారు. అవివాహితుడైన అతడు బంధువుల్లోని ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే సుధాకర్ తరచూ అసోంలోని శక్తిపీఠం కామాఖ్య ఆలయానికి తరచూ వెళ్లి వస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన హర్షిత్, పవన్‌లు ఆయన వద్ద శిష్యులుగా చేరారు. శనివారం అర్ధరాత్రి జోగిని సుధాకర్ గొంతు నులుమి వారు హత్య చేశారు. అనంతరం డబ్బు, నగదు, కారుతో వారు ఉడాయించారు. దీంతో సుధాకర్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి నివాసం సమీపంలోని సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలో పవన్, హర్షిత్ నిందితులుగా గుర్తించారు. కారులో పరారవుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ ఎండీ
ముంచుకొస్తున్న మురసు తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు
For More TG News And Telugu News