Share News

ముంచుకొస్తున్న మురసు తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:27 AM

మురసు తుఫాన్ ముంచుకొస్తుంది. సోమవారం సాయంత్రం నెల్లూరు - ఒంగోలు మధ్య ఈ తుఫాన్ తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

ముంచుకొస్తున్న మురసు తుఫాన్.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఏర్పాటు

అమరావతి, నవంబర్ 02: మురసు తుఫాన్ ముంచుకొస్తుంది. నేటి సాయంత్రం నెల్లూరు - ఒంగోలు మధ్య ఈ తుఫాన్ తీరం దాటనుంది. దీంతో కృష్ణా, పెన్నా బేసిన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై మురసు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ (RTGS) నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే వివిధ శాఖల మంత్రులు.. ఆయా శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.


48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ: మంత్రి గొట్టిపాటి

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు సిబ్బంది, యంత్రాలు తెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.


ఫ్లడ్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు: మంత్రి నిమ్మల

రిజర్వాయర్లలో నీటి ప్రవాహాలను ప్రతి రెండు గంటలకూ ఒకసారి గమనించాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ శాఖల సమన్వయంతో ఫ్లడ్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వాగులు, వంకల వద్ద జన సంచారాన్ని నిలిపివేయాలని సూచించారు. తుఫాన్ వేళ.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.


కంట్రోల్ రూమ్ నంబర్లు..

  • సీఆర్డీఏ (CRDA) సర్కిల్: 8331092947

  • చిలకలూరిపేట: 9491052943

  • మంగళగిరి: 6281703602

  • పల్నాడు సర్కిల్: 7661019447

  • మాచర్ల: 9440817531

  • నరసరావుపేట: 9440817539


  • మార్కాపురం సర్కిల్: 7780420711

  • కనిగిరి: 9440812364

  • మార్కాపురం: 9440817509

  • గిద్దలూరు: 8247722971

  • ఎన్టీఆర్ సర్కిల్: 9440817561

  • విజయవాడ రూరల్: 7382623229

  • విజయవాడ టౌన్: 7382623226


  • నూజివీడు: 7382623224

  • గుణదల: 9491052947

  • ప్రకాశం సర్కిల్: 9440817491

  • ఒంగోలు: 9440817495

  • అద్దంకి: 9490611613

  • దర్శి: 9491065264


  • కందుకూరు: 9491052950

  • బాపట్ల సర్కిల్: 9281413774

  • బాపట్ల: 9491052945

  • చీరాల: 9440817597

  • గుంటూరు సర్కిల్: 9440817526

  • గుంటూరు: 9440817527


  • తెనాలి: 9440817535

  • కృష్ణా సర్కిల్: 6281709355

  • మచిలీపట్నం: 8672222294

  • ఉయ్యూరు: 7382623231

  • గుడివాడ: 9440817573


ఈ వార్తలు కూడా చదవండి..

మురసు తుఫాన్‌పై సర్కార్ హైఅలర్ట్.. 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అనిత ఆదేశం

రైవాడలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్యాయత్నం

For More AP News And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 12:00 PM