పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:17 PM
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మూడేళ్లుగా శారీరక సంబంధం పెట్టుకుని.. ఆపై మోసం చేశాడంటూ సదరు యువతి ఆరోపించింది. అంతేకాక తాను మోసపోయానంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా మొగ్రా పోలీస్ స్టేషన్లో ఆ యువతి తన తల్లితో కలిసి వెళ్లి ఆ క్రికెటర్‌పై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా.. తనపై దాడికి పాల్పడ్డాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
యువతి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆ మహిళ అభిషేక్ పోరెల్‌తో గత మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్నాళ్లు వీరి బంధం బాగానే సాగినప్పటికీ.. 2025లో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ ఆమెకు క్రమక్రమంగా దూరమయ్యాడు. అలానే పెళ్లికి నిరాకరించడంతో ఈ వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్ చేరింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తనపై వచ్చిన ఆరోపణలను 23 ఏళ్ల అభిషేక్ పోరెల్ తీవ్రంగా ఖండించాడు. తాను క్రికెట్లో రాణిస్తూ మంచి ఫామ్‌లో ఉన్నందుకే కొందరు కావాలనే తన పేరును వివాదాల్లోకి లాగుతున్నారని అన్నాడు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ, ధోనీ, రోహిత్‌లను తన పెళ్లికి పిలవని టీమిండియా క్రికెటర్
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!