నేరేడు పళ్లు విరగ కాస్తున్నాయి.. ఇది కరువుకు సంకేతమా..
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:00 PM
ప్రస్తుతం మార్కెట్‌లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి. నేరేడు పళ్లు అధికంగా కాస్తే ఆ ఏడాది కరువు వస్తుందని చాలా మంది చెబుతున్నారు (Jamun harvest drought in India).
ఆధునిక వృక్షశాస్త్రంలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు ఈ పరిశీలన వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తున్నాయి. భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు చెట్లు తమ జీవన చక్రంలో మార్పులు చేస్తాయి. అలాంటి సమయాల్లో, చెట్లు కొత్త కొమ్మలు, ఆకులు రావడంపై కాకుండా, పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వెచ్చిస్తాయి. ఇది చెట్టు తన జాతి మనుగడ కోసం అనుసరించే ఒక సహజ వ్యూహం (Viral jamun post).
నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా భూమిలోకి వెళ్తాయి. పై పొరలో నీరు లేకపోయినా, భూగర్భ జలాలను ఉపయోగించుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన చెట్లు సైతం నీటి ఒత్తిడిని ఎదుర్కొంటే, అది భూగర్భ జలాల పరిస్థితిపై ఒక తీవ్రమైన హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు. అందుకే మన పూర్వీకులు నేరేడు చెట్లను గమనించి వాతావరణం గురించి అంచనాలు వేసేవారు. అందువల్లే ఈ ఏడాది తీవ్ర కరువు వస్తుందని కొందరు నమ్మకంగా చెబుతున్నారు (Jamun drought claim).

మరికొందరు మాత్రం ఈ వాదనను కొట్టిపడేస్తున్నారు. పుష్పించే దశలో నేరేడు చెట్లకు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటే పూత నిలిచి, పళ్ల దిగుబడి అధికంగా ఉంటుంది. అంటే ఉత్పత్తి పెరగడం అనేది గతంలో ఉన్న వాతావరణ పరిస్థితులను సూచించవచ్చు గానీ, భవిష్యత్తులో కరువు వస్తుందని చెప్పే సూచిక కాదని వారు స్పష్టం చేస్తున్నారు (India monsoon news).
ఏదేమైనా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించినంత చురుకుగా లేకపోవడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదైంది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనికి, నేరేడు పళ్ల దిగుబడికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు మరింత తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..