Share News

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చ..

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:16 PM

తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సమావేశమయ్యారు.

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చ..

కర్ణాటక: తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఓ ఆడిటోరియంలో ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.


తొలుత కొప్పల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, కర్ణాటక మంత్రులు, అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశం ప్రారంభమైన 15 నిమిషాల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిటోరియానికి చేరుకున్నారు. దీంతో ముగ్గురు నేతలు జల వివాదాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.


మరోవైపు తుంగభద్ర డ్యాంకు అత్యాధునిక సాంకేతికతతో అత్యంత పటిష్టమైన 33 క్రస్ట్ గేట్లను అమర్చారు. వాటిని కేంద్ర మంత్రి, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా, 2024లో వరద ప్రవాహానికి తుంగభద్ర 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. నీటి వృథాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వ చొరవతో, సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో స్టాప్‌లాక్ గేటును ఏర్పాటు చేశారు. స్పిల్‌వే గేట్లన్నింటినీ మార్చాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ఇవ్వడంతో ఆరు నెలల్లోనే కొత్త గేట్ల ఏర్పాటును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు పూర్తి చేశాయి.


నీటిపారుదల నిపుణుల కమిటీ సూచనల మేరకు రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను పునరుద్ధరించారు. 73 ఏళ్ల కిందట నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ భూమిపై వైసీపీ భూ కబ్జాదారుల కన్ను

దేవినేని నెహ్రూ లేకపోతే నువ్వు ఆఫ్ట్రాల్.. అవినాష్‌పై పట్టాభి ఫైర్


Updated Date - Jun 25 , 2026 | 02:15 PM