షేక్ చేసిన అభిషేక్.. కోహ్లీ రికార్డు బద్దలు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:38 PM
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది రికార్డుల మోత మోగించాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. కేవలం 35 బంతుల్లోనే శతకం బాది రికార్డుల మోత మోగించాడు. 199 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన అభిషేక్.. తొలి బంతి నుంచే కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో కలిసి క్రీజులోకి వచ్చి.. ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడు. ఈ క్రమంలోనే అభిషేక్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే వెనుదిరిగిన అభిషేక్.. ఈ మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగిపోయాడు. కేవలం 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 అద్భుతమైన సిక్సర్లతో 113 పరుగులు సాధించి పదో ఓవర్లో వెనుదిరిగినా, అప్పటికే భారత్ విజయం ఖారారైంది. ఈ సెంచరీ అభిషేక్ కెరీర్‌లో మొత్తం మీద 11వది కావడం విశేషం. దీని ద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (10 సెంచరీలు) రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (13) మాత్రమే అభిషేక్ కంటే ముందున్నాడు. అలాగే అంతర్జాతీయ టీ20ల్లో ఇది శర్మకు ఇది నాల్గో శతకం. గతేడాది జనవరిలో ఇంగ్లాండ్‌పై, సెప్టెంబర్‌లో అఫ్ఘానిస్థాన్‌పై మెరుపు శతకాలు బాదిన అభిషేక్.. తాజాగా కివీస్‌పై మరోసారి తన సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు అభిషేక్ ఖాతాలో చేరాయి. ఎదుర్కొన్న తొలి బంతికే ఎక్కువసార్లు సిక్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 8 సార్లు తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ బాదాడు. తొలి ఓవర్‌లో అత్యధిక సిక్స్ బాదిన ఘనత కూడా అభిషేక్ శర్మదే. ఇప్పటి వరకు శర్మ 17 సిక్స్‌లు బాదాడు. వేగంగా 50 పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. టీ20ల్లో శతకాలు సాధించిన ఆరో బ్యాటర్‌గా అభిషేక్(4) ఉన్నాడు. రోహిత్ శర్మ కెరీర్‌లో ఐదు శతకాలు ఉన్నాయి. సెంచరీ చేసినప్పుడు అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న రెండో బ్యాటర్‌గా(297.36) అభిషేక్ నిలిచాడు. ఈ జాబితాలో తొలిస్థానం(317.64) కూడా అతడిదే.
అత్యధిక టీ20 సెంచరీలు చేసిన భారత ప్లేయర్లు
11 – అభిషేక్ శర్మ (216 ఇన్నింగ్స్‌లు)
10 – విరాట్ కోహ్లీ (413 ఇన్నింగ్స్‌లు)
8 -కేఎల్. రాహుల్ (240), సంజు శాంసన్ (344), రోహిత్ శర్మ (459)
7 – శుభ్‌మన్ గిల్ (189).
ఇవి కూడా చదవండి:
ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం సర్వత్రా అప్రమత్తం
అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 150 వికెట్లకు ఒక్క అడుగు దూరంలో!
బాలెన్ డి ఓర్ అవార్డు: ఈ విజయానికి అర్హుడివి.. హ్యారీ కేన్‌కు కోహ్లీ స్పెషల్ విషెస్!