Share News

తుఫాన్ హెచ్చరికలతో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:21 PM

ఆర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తమైంది. ​విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండాలని అధికారులకు సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ​

తుఫాన్ హెచ్చరికలతో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తం.. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
Arnab Cyclone

అమరావతి, అక్టోబర్ 27: ఆర్నబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తమైంది. ​విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండాలని అధికారులకు సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ​అత్యవసర పరిస్థితుల దృష్ట్యా సర్కిల్, డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ​విద్యుత్ సిబ్బంది, అధికారులు ఎవరూ సెలవులు తీసుకోకూడదని సీఎండీ స్పష్టం చేశారు. ​వర్షాలు, గాలులకు దెబ్బతిన్న తీగలు, స్తంభాల పునరుద్ధరణకు సిబ్బంది, వాహనాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ​తెగిపడిన విద్యుత్ తీగలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దని సీఎండీ పి.పుల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.


​ఏపీసీపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..

  • ​కృష్ణా: 6281709355

  • ఎన్టీఆర్: 9440817561

  • గుంటూరు: 9440817526

  • ​బాపట్ల: 9281413774

  • ప్రకాశం: 9440817491

  • పల్నాడు: 7661019447


ఇవి కూడా చదవండి...

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రాజ్‌ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:28 PM