Share News

ఏపీపై ‘ఆర్నబ్’ ఎఫెక్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:56 PM

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ఏపీ తీరంవైపుకు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంగా కదిలి అతి తీవ్ర తుఫాన్‌గా మారింది.

ఏపీపై ‘ఆర్నబ్’ ఎఫెక్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
Arnab Cyclone

అమరావతి, అక్టోబర్ 27: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ఏపీ తీరంవైపుకు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంగా కదిలి అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 170 కిలోమీటర్లు, కాకినాడకు180 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 270 కిలోమీటర్లు, బాపట్లకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


ఈరోజు సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రేపు (బుధవారం) ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.


మరోవైపు ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సన్నద్ధతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. వివిధ జిల్లాల్లో ఆర్నబ్ తుఫాన్ చూపనున్న ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తుఫాన్ ప్రభావం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

‘ప్రాణనష్టం జరగకుండా చూడాలి’.. ఆర్నబ్ తుఫాన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రాజ్‌ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:22 PM