తెలంగాణలో 1.90 లక్షల మంది మహిళలకు కుట్టు మిషన్లు: పొన్నం ప్రభాకర్
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:33 PM
బీసీ సంక్షేమ శాఖ, విద్యా నిధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 27: బీసీ సంక్షేమ శాఖ, విద్యా నిధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. 38 బీసీ ఆత్మగౌరవ భవనాల జీవోల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. డిసెంబర్ 9న మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీకి కార్యాచరణ చేపట్టాలని, కుట్టు మిషన్ల పథకానికి 4.80 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. 1.90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
తెలంగాణలోని 327 గురుకులాల్లో 26 పాఠశాలలకే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన 301 గురుకులాలకు సొంత భవనాల నిర్మాణంపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. గురుకులాలకు అవసరమైన స్థలాల సేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీసీ స్టడీ సర్కిళ్లలో సంస్కరణలు, ఉద్యోగాలే లక్ష్యంగా నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. బీసీలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. బీసీ వితంతువులు, ఒంటరి మహిళలకు నైపుణ్య శిక్షణపై ప్రత్యేక కమిటీని నియమించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రజల ప్రాణ రక్షణకే తొలి ప్రాధాన్యం
జవహర్నగర్ డంపింగ్ యార్డు తరలించాలంటూ ఈటల మహాపాదయాత్ర ప్రారంభం
Read Latest Telangana News And Telugu News