సోషల్ మీడియా ఫాలోవర్లు 26 లక్షల మంది.. ఓట్లు మాత్రం 33..!
ABN , Publish Date - Oct 27 , 2026 | 03:34 PM
సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్ప అని భావిస్తుంటాం. ప్రజాదరణకు ఈ ఫాలోంగ్ అద్దం పడుతుందనుకుంటాం.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్ప అని భావిస్తుంటాం. ప్రజాదరణకు ఈ ఫాలోంగ్ అద్దం పడుతుందనుకుంటాం. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే అనుకున్నారు. తనకున్న 26 లక్షల ఫాలోవర్లను నమ్ముకుని ఎన్నికల బరిలో దిగారు. అయితే ఆయనకు ఎన్నికల ఫలితాల వేళ ఊహించని షాక్ తగిలింది. ఆన్‌లైన్‌లో లక్షల అనుచరులున్నా.. పోలింగ్‌లో ఆ వ్యక్తికి కేవలం 33 ఓట్లే వచ్చాయి. దీంతో ఆయన గుండె గుభేలుమంది. ఈ మొత్తం వ్యవహారంపై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.
రాజస్థాన్‌లో నివసించే ఓంప్రకాశ్ బిష్ణోయ్ వంట వీడియోలు చేస్తూ ఆన్‌లైన్‌లో అనుచరులను సంపాదించారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు సోషల్ మీడియా యాప్స్‌లో ఏకంగా 21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలాగే యూట్యూబ్‌లో 5 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మొత్తం కలిపితే 26 లక్షలమంది. ఓంప్రకాశ్ అలా వీడియోలు అప్‌లోడ్ చేస్తే ఇలా లైకులు కుప్పలు కుప్పలుగా వచ్చిపడేవి. ఆయన వంట వీడియోలను అభిమానులు ఇష్టంగా చూసేవారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇటీవల ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఢంకా మోగింది. తనకు వచ్చే లైకులను ఓట్లుగా ఎందుకు మార్చుకోకూడదని ఓం ప్రకాశ్‌కు ఆలోచన తట్టింది. స్థానిక ఎన్నికల్లో నిలబడి, తన గ్రామానికి సర్పంచ్ కావాలని ఆయనకు అనిపించింది.
ఈ మేరకు నామినేషన్ వేసి సర్పంచ్ పదవి కోసం పోటీ పడ్డారు ఓంప్రకాశ్. ఎన్నికలు సజావుగానే ముగిశాయి. ఫలితాలు రానే వచ్చాయి. సరిగ్గా అప్పుడే ఇన్‌ఫ్లుయెన్సర్ గుండెలో రాయిపడింది. 1600 ఓట్లు ఉన్న పంచాయతీలో ఆయనకు 33 ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది ఓటు బ్యాంకుగా మారుతుందా.. అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి
మైక్రోసాఫ్ట్‌లో చేరిన 3 నెలలకే జాబ్‌కు ఎసరు.. భారత టెకీ ఆవేదన
పక్షవాతం నటించి భిక్షాటన.. చివరికి ఏమైందో మీరే చూడండి..