Share News

పక్షవాతం నటించి భిక్షాటన.. చివరికి ఏమైందో మీరే చూడండి..

ABN , Publish Date - Oct 27 , 2026 | 11:09 AM

పక్షవాతం వచ్చినట్లు కనిపిస్తూ వీధిలో భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తామనగానే అతను ఒక్కసారిగా లేచి పరుగెత్తినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పక్షవాతం నటించి భిక్షాటన.. చివరికి ఏమైందో మీరే చూడండి..
beggar fake paralysis

ఇంటర్నెట్ డెస్క్: పక్షవాతం వచ్చినట్లు కనిపిస్తూ వీధిలో భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తామని చెప్పగానే ఒక్కసారిగా లేచి పరుగెత్తినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న క్లిప్‌లో.. వీధిలో భిక్షాటన చేస్తున్న వ్యక్తి వద్దకు మరో వ్యక్తి వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అతడికి పక్షవాతం ఎలా వచ్చింది? వైద్య చికిత్స తీసుకున్నాడా? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో అతడికి ఇంజెక్షన్ ఇస్తానని.. దాని ద్వారా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా మారినట్లు కనిపిస్తోంది. అప్పటివరకు పక్షవాతంతో శారీరకంగా ఇబ్బంది పడుతు నేలపై పడుకున్నఅతడు వెంటనే లేచి అక్కడి నుంచి పరుగెత్తడం వీడియోలో కనిపిస్తోంది.


‘మహమ్మద్ తోహా 09 ’పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంజెక్షన్ ఇస్తామని చెప్పగానే ఆ వ్యక్తి ఎందుకు పరుగెత్తాడు? అతడు నిజంగానే పక్షవాతంతో బాధపడుతున్నాడా? లేక భిక్షాటన కోసం అలా కనిపిస్తున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి ఫేక్ బిక్షగాళ్లు రోడ్లపై ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తే భలే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అసలు ఆ వ్యక్తికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా? ఇంజెక్షన్ ఇస్తానని చెప్పగానే అతడు ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు? అనే విషయాలపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్‌ నివేదికలు బుట్టదాఖలు

పంటకు మురుగు నీరే దిక్కాయె!

ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 27 , 2026 | 12:08 PM