Share News

సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ ధ్యానం.. వీడియో వైరల్...

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:14 PM

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(38 బంతుల్లో 113) మెరుపు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ ధ్యానం.. వీడియో వైరల్...
Abhishek Sharma Meditation

స్పోర్ట్స్ డెస్క్: వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 199 పరుగుల భారీ టార్గెట్‌ను భారత్ 13.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(38 బంతుల్లో 113) మెరుపు సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


అభిషేక్ శర్మ 38 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్ అందుకున్న అనంతరం అతడు మైదానంలో కూర్చొని ధ్యాన ముద్ర వేశాడు. అంతేకాక పద్మాసనంలో ధ్యానం చేస్తూ.. 'ఓం నమఃశివాయ' మంత్రాన్ని జపించాడు. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా అభిషేక్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించినప్పుడు విక్టరీ మార్క్ లేదా ఎల్ సంకేతం చూపిస్తూంటాడు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా ధ్యానం చేస్తూ క్రికెట్ ప్రియులను ఆకర్షించాడు. సునామీ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మపై క్రీడాభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


మరోవైపు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీల విధ్వంసకర బ్యాటింగ్‌ కారణంగా టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్‌లో పవర్‌ ప్లేలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్(118/0) నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా(113/1) పేరిట ఉంది. తక్కువ బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్న సభ్యదేశాల్లో భారత్ తొలిస్థానంలో ఉంది. 2.2 ఓవర్లలో భారత్ 50 పరుగుల మైలురాయిని అందుకుంది. అలానే తొలి ఓవర్‌లో టీమిండియాకు 26 పరుగులు రావడంతో ఐసీసీ ఫుల్ మెంబర్ హోదా ఉన్న దేశంపై మరో దేశానికి ఇవే అత్యధిక పరుగులు కావడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు

ఖైదీలు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?.. విజయ్‌ను నిలదీసిన స్టాలిన్

12 బంతుల్లో 50 పరుగులు.. యువరాజ్‌కు అభిషేక్ శర్మ ఫన్నీ కౌంటర్..

షేక్ చేసిన అభిషేక్.. కోహ్లీ రికార్డు బద్దలు!

Updated Date - Oct 27 , 2026 | 06:24 PM