Share News

12 బంతుల్లో 50 పరుగులు.. యువరాజ్‌కు అభిషేక్ శర్మ ఫన్నీ కౌంటర్..

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:43 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.

12 బంతుల్లో 50 పరుగులు.. యువరాజ్‌కు అభిషేక్ శర్మ ఫన్నీ కౌంటర్..
Yuvraj Singh, Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత అతడికి తన గురువు, మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ నుంచి సరదా సవాలు ఎదురైంది. దీనికి అభిషేక్ కూడా నవ్వులు పూయించేలా సమాధానం ఇచ్చాడు (Abhishek Sharma reply to Yuvraj Singh).


న్యూజిలాండ్‌పై అభిషేక్ శర్మ, యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడటంపై యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో అభిషేక్‌ను సరదాగా ఆటపట్టించాడు. 'ఇప్పటికీ 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావు కదా అభిషేక్' అంటూ ట్వీట్ చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై యువరాజ్ కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ఇప్పటికీ యువీ పేరిటే ఉంది (Abhishek Sharma century).


మ్యాచ్ అనంతరం యువరాజ్ వ్యాఖ్యపై స్పందించిన అభిషేక్ నవ్వుతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు (12 ball fifty). 'ఆ సమయంలో యువీ పా ఎలాంటి క్రికెట్ ఆడేవాడో నాకు తెలియదు. కానీ 12 బంతుల్లో 50 పరుగులు చేయడం అంత సులభం కాదు. ఎవరైనా బ్యాటర్ అలా ఆడాలంటే అది చాలా కష్టం. అప్పుడప్పుడు మాత్రమే అలాంటి అద్భుతాలు జరుగుతాయి' అని అభిషేక్ పేర్కొన్నాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టును గెలిపించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి..

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు


అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..

Updated Date - Oct 27 , 2026 | 06:24 PM