సెంచరీ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న బెంగాల్ బ్యాటర్ అభిషేక్!
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:53 PM
దేశవాళీ క్రికెట్‌న ప్రదర్శనతో రాణిస్తున్న బెంగాల్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ ఇటీవల వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఆ వివాదలపై స్పందిస్తూ.. మైదానంలో తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయిస్తానని అతడు పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌న ప్రదర్శనతో రాణిస్తున్న బెంగాల్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ ఇటీవల వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలిచాడు. మైదానంలో తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయిస్తానని, ప్రతిక్షణం తనను మానసికంగా దృఢంగా మార్చుకున్నానని అతడు పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీ2026-27 సీజన్‌లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సోమవారం బెంగాల్ తరఫున్ అభిషేక్ పోరెల్ అజేయ శతకాలతో రాణించాడు.
ఆదివారం ఢిల్లీని 240 పరుగులకే ఆలౌట్ చేసిన బెంగాల్ జట్టు.. సోమవారం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. సోమవారం ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఘరామీ (221 బంతుల్లో 122 నాటౌట్), పోరెల్ (161 బంతుల్లో 114 నాటౌట్) నాలుగో వికెట్‌కు 199 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక సెంచరీ అనంతరం అభిషేక్ పోరెల్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ.. తన శతకం గురించి వెల్లడించడమే కాకుండా, తనపై వచ్చిన అత్యాచార ఆరోపణల కేసుపై కూడా మౌనం వీడాడు.
'ఒక భిన్నమైన ప్రపంచంలో, విశ్వంలో ఎలా మనుగడ సాగించాలో నేను చూశాను. అక్కడి నుంచి నేను ఎన్నో సానుకూల విషయాలను గ్రహించాను. అవి నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. ప్రతి రోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకను నేను గడిపిన తీరు.. 'నేను నోటితో కాదు, నా బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాను' అని నాకు నిరంతరం గుర్తుచేస్తూనే ఉంది' అని అభిషేక్ అన్నాడు.
అభిషేక్ పోరెల్‌పై ఉన్న ఆరోపణలు ఏంటంటే..
అభిషేక్ పోరెల్‌పై కర్ణాటకకు చెందిన ఓ వైద్య విద్యార్థిని ఇటీవల తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది. గత మూడేళ్ల కాలంగా వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విదేశాలకు కూడా వెళ్లినట్లు ఆరోపించిన బాధితురాలు.. వివాహం విషయానికి వచ్చేసరికి అతడు నిరాకరించారని పేర్కొన్నాడు. గతంలోనూ వీరి మధ్య గొడవలు జరగగా పోలీసుల జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పోలీసుల నుంచి స్పందన కరువైందంటూ బాధితురాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు. పోరెల్ ఒకవైపు క్రికెట్ కెరీర్ దూసుకుపోతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ పరిణామాలు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
యూట్యూబ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూసి నేర్చుకున్నా: ఆసీస్ ప్లేయర్
భారత్-శ్రీలంక మ్యాచ్ వేదిక మార్పుపై వార్తలు.. బీసీసీఐ క్లారిటీ