Share News

ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:05 PM

ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం రాజధాని అమరావతిలోని ఆర్టీజీఎస్‌‌లో ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రజల ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, అక్టోబర్ 12: ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం రాజధాని అమరావతిలోని ఆర్టీజీఎస్‌‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రభుత్వ సేవల గురించి అధికారులను ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం పీజీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజల సమస్యలను వీలైనంత మేరకు పరిష్కరించగలుగుతున్నామని అన్నారు. మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను ఆదేశించారు.


రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత వాటిని పరిష్కరించే విషయంలో ఉద్యోగులకు, అధికారులకు జవాబుదారీతనం ఉండేలా చూడాలని సూచించారు. అయితే వివిధ శాఖలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలను వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని వివరించారు.


ముఖ్యంగా రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవోలపై ఈ తరహా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సాయిప్రసాద్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు సీఎం విజయ్

విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం

For More AP News And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 08:21 PM