విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం
ABN , Publish Date - Oct 12 , 2026 | 06:46 PM
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ రోడ్డులో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు.
విజయవాడ, అక్టోబర్ 12: నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ రోడ్డులో కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.
ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి పోలీసులు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు గుంటూరు జిల్లా నంబూరు, విజయవాడ సమీపంలోని నున్న వాసులని పోలీసులు వివరించారు. మృతులు రాందేవ్, అరుణ, విజయతోపాటు చిన్నారిగా గుర్తించామని అన్నారు. నంబూరులో ఓ ఫంక్షన్‌లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.
ప్రమాదం తీవ్రంగా కలచివేసింది: మంత్రి లోకేశ్
ఈ ప్రమాద ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘విజయవాడ వెస్ట్ బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనం కావడం తీవ్రంగా కలచివేసింది. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడిదారులకు అండగా కూటమి ప్రభుత్వం: డిప్యూటీ సీఎం
బొల్లారం చిన్నారి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. డబ్బు కోసం సెక్యూరిటీ గార్డే..
For More AP News And Telugu News