బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు సీఎం విజయ్
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:16 PM
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ దర్శించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకి అమ్మవారిని ఆయన దర్శించుకుంటారు.
విజయవాడ, అక్టోబర్12: నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ దర్శించుకోనున్నారు. మంగళవారం (13-10-2026) సాయంత్రం 4.30 గంటలకి అమ్మవారిని ఆయన దర్శించుకుంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి సోమవారం ఇంద్రకీలాద్రికి సీఎం భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ రూట్ మ్యాప్‌ను వారు పరిశీలించారు. మరో వైపు ఏపీలో సీఎం విజయ్ పర్యటన షెడ్యూల్‌ను తమిళనాడు సీఎం కార్యాలయం విడుదల చేసింది.
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్ 2.0ను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు రావాలంటూ తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్‌ను ఏపీ టీడీపీ ఎంపీలు స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇటీవల చెన్నైలో సీఎం విజయ్‌ను ఎంపీలు కేశినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీశ్ బాలయోగి కలిసిన సంగతి తెలిసిందే.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం (13-10-2026) ఏపీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్..
మధ్యాహ్నం 02:30 గంటలకు నీలంకరై క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం విజయ్ బయలుదేరుతారు.
మధ్యాహ్నం 03:00 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
సాయంత్రం 04:00 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాయంత్రం 04:00 - 04:10 గంటలకు విమానాశ్రయంలో సీఎం విజయ్‌కు స్వాగతం పలకనున్న ప్రముఖులు.
సాయంత్రం 04:10 గంటలకు విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయానికి బయలుదేరుతారు.
సాయంత్రం 04:55: కనకదుర్గ ఆలయానికి చేరుకుంటారు.
సాయంత్రం 05:00 - 05:45 దుర్గమ్మ దర్శనం.
సాయంత్రం 05:45 గంటలకు దుర్గమ్మ ఆలయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్తారు.
సాయంత్రం 06:00 నుంచి 07:00 గంటలు మధ్య ఇరు రాష్ట్రాల సీఎంలు నదుల అనుసంధానంపై చర్చించనున్నారు.
ఎ) గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్ట్
బి) కృష్ణా నీటి విడుదల.
తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఈ చర్చల్లో పాల్గొంటారు.
సాయంత్రం 07:00 గంటలకు ముఖ్యమంత్రి నివాసం నుంచి పున్నమి ఘాట్ వద్ద ఉన్న ఉత్సవ్ మైదానానికి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
రాత్రి 07:10 గంటలకు విజయవాడ ఉత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
రాత్రి 07:10 - 08:00 గంటలకు ఉత్సవ కార్యక్రమాలు
రాత్రి 08:00 గంటలకు ఉత్సవ వేదిక నుంచి సీఎం విజయ్ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
రాత్రి 08:50 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.
రాత్రి 09:00 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరుతారు.
రాత్రి 10:00 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు.
రాత్రి 10:30 గంటలకు క్యాంప్ ఆఫీసుకు సీఎం విజయ్ చేరుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడ బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి సజీవ దహనం
పెట్టుబడిదారులకు అండగా కూటమి ప్రభుత్వం: డిప్యూటీ సీఎం
For More AP News And Telugu News