Share News

స్పెయిన్ ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఫౌంటెన్ కూలి బాలుడి మృతి

ABN , Publish Date - Jul 20 , 2026 | 06:57 PM

ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఫౌంటెన్‌లోని భాగం కూలిపోవడంతో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

స్పెయిన్ ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఫౌంటెన్ కూలి బాలుడి మృతి
Spain World Cup celebrations

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. జట్టు విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ఫౌంటెన్‌లోని భాగం కూలిపోవడంతో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సలమాంకా ప్రావిన్స్‌లోని చారిత్రక నగరం సియుడాడ్ రోడ్రిగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జెంటీనాపై స్పెయిన్ 1-0తో విజయం సాధించి ప్రపంచకప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత వందలాది మంది అభిమానులు 'ఆర్బోల్ గోర్డో' ఫౌంటెన్ వద్ద సంబరాల్లో పాల్గొన్నారు.


ఈ విషాద ఘటనపై సియుడాడ్ రోడ్రిగో మున్సిపల్ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ విషాదంతో నగరమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. మరణించిన బాలుడి కుటుంబ సభ్యులు, స్నేహితుల బాధలో మేమంతా భాగస్వాములమే. స్పెయిన్ ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకోవాల్సిన రోజు విషాదంగా మారింది’ అని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 20 , 2026 | 07:05 PM