Share News

ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 10:47 AM

ఆసియా గేమ్స్‌లో జపాన్‌పై భారత మహిళల టీమ్ ఘన విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే సెమీస్ మ్యాచ్ నిర్వహించే గ్రౌండ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఆసియా గేమ్స్: సెమీ ఫైనల్ గ్రౌండ్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళనలు
Korogi Sports Park.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో తన తొలి మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించి.. ఆదివారం బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్‌‌‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా కోరోగి స్పోర్ట్స్ పార్క్‌లోనే జరగనుండటంతో పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రౌండ్‌లో కొన్ని చోట్ల నీరు నిల్వ ఉండిపోయింది. దానివల్ల క్రీడాకారులకు, రిపోర్టర్లు గ్రౌండ్‌లో తిరిగే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


మరోవైపు.. వసతుల విషయంలోనూ భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. క్రీడా గ్రామాన్ని(అథ్లెట్ల కోసం నిర్మించే ప్రత్యేక వసతి గృహాలు) కూడా ఆసియా గేమ్స్‌లో ఏర్పాటు చేయలేదు. క్రీడాకారులకు ఓ భారీ ఓడలో నిర్వాహకులు వసతిని ఏర్పాటు చేశారు. దీంతో అథ్లెట్లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ స్పందించింది. ప్రత్యేక క్రీడా గ్రామం ఆలోచన మంచిదే అయినప్పటికీ.. తాము నిర్వాహకులను కూడా దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే దోహా, రియాద్‌లో జరిగే తరువాతి ఆసియా క్రీడాల్లో కచ్చితంగా ప్రత్యేక అథ్లెట్ల గ్రామాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.


కాగా.. అక్టోబరు 4 వరకు జరిగే ఈ ఆసియా గేమ్స్‌లో 46 దేశాల నుంచి 11 వేలమందికిపైగా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. 43 క్రీడాంశాలు, 71 విభాగాలలో కలిపి.. మొత్తం 469 పతకాలకు పోటీ పడుతున్నారు.. 54 వేదికలలో క్రీడలు జరగనున్నాయి. ఇక 501 మంది అథ్లెట్లతో భారత్‌ బరిలోకి దిగుతోంది.. గత ఎడిషన్‌లో 107 (28-38-41) పతకాలతో సాధించిన నాలుగో స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా మన క్రీడాకారులు సై అంటున్నారు.


ఇవీ చదవండి

ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా పవన్

ఆసియా క్రీడల్లో నఖ్వీ పతకాలు ఇస్తే ఏం చేస్తారు.. బీసీసీఐ స్పందన ఏంటంటే..

Updated Date - Sep 19 , 2026 | 11:05 AM