రోహిత్ కెప్టెన్సీతోనే ఎంఐ ఛాంపియన్‌గా నిలుస్తుందని అనుకోలేం: అశ్విన్
ABN , Publish Date - Nov 28 , 2026 | 09:17 AM
ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించడంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించడంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కెప్టెన్సీ వల్లే ఎంఐకి పూర్వ వస్తుందని, మళ్లీ ఛాంపియన్‌గా నిలుస్తుందని అనుకోవడానికి లేదని వెల్లడించాడు. జట్టు సమస్య కెప్టెన్సీ మాత్రమే కాదని, దాని వెనుక మరో లోతైన కారణం ఉందని తెలిపాడు. అయితే హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్ ట్రేడ్ అవ్వడంతో రోహిత్ శర్మకే ఎంఐ ఫ్రాంచైజీ జట్టు పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే.
‘ముంబై చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచింది. ఆ తర్వాత వారి అత్యుత్తమ ప్రదర్శన నాలుగో స్థానం మాత్రమే. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నా, హార్దిక్ పాండ్య నాయకత్వం వహించినా ఫలితం మాత్రం దాదాపు ఒకేలా ఉంది. కెప్టెన్సీనే సమస్య అని, హార్దిక్ కంటే రోహిత్ మెరుగ్గా జట్టును నడిపించేవాడని కొందరు వాదించవచ్చు. కానీ ఇక్కడ అంతకంటే లోతైన సమస్య ఉందని నేను భావిస్తున్నాను. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మహేంద్ర సింగ్ ధోనీని వేరు చేయలేం. అదే విధంగా ముంబై ఇండియన్స్ వారసత్వం నుంచి రోహిత్ శర్మను వేరు చేయలేం. ఒకప్పుడు ఆ ఫ్రాంచైజీకి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన విజయాల సంస్కృతిని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ముంబై ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.
ప్రతి ఆటగాడు రోహిత్‌ను గౌరవిస్తాడు. కీరన్ పొలార్డ్, రోహిత్ మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్‌కు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ముంబై యాజమాన్యం తిరిగి అతడికి బాధ్యతలు అప్పగించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు’ అని అశ్విన్ వివరించాడు.
రోహిత్ హయాంలోనూ ముంబైకి ఎదురుదెబ్బలే!
2020లో ఐదో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ముంబై ప్రదర్శన క్రమంగా తగ్గింది. రోహిత్ కెప్టెన్సీలో 2021లో ఐదో స్థానం, 2022లో పదో స్థానం సాధించింది. 2023లో క్వాలిఫయర్-2 వరకు చేరుకుని నిష్క్రమించింది. ఇక హార్దిక్ కెప్టెన్సీలో 2024లో పదో స్థానం, 2025లో క్వాలిఫయర్-2లో ఓటమి, 2026లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మూడేళ్ల తర్వాత జట్టు పగ్గాలు తిరిగి చేపట్టిన రోహిత్ శర్మ.. ఎంఐకి పూర్వ వైభవం తీసుకొస్తాడా? లేడా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2027: ఎంఐ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా!
భారత్‌తో రెండో టెస్టు: ఆకాశ్ దీప్ ‘ఫైఫర్’.. 356 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్