కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్.. ఈ వైరల్ వీడియో చూశారా?
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:31 PM
అండర్ 19 ఆసియా కప్‌లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. 160 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో ఆర్యవీర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అండర్ 19 ఆసియా కప్‌లో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. 160 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలో ఆర్యవీర్‌కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఆర్యవీర్ ఇంటర్వ్యూ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
2017లో ఓ కార్యక్రమంలో అప్పటి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చిన్నారి ఆర్యవీర్ ఇంటర్వ్యూ చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లీకి వీరేంద్ర సెహ్వాగ్‌తో మొదటిసారి పరిచయం ఎలా ఏర్పడిందని ఆర్యవీర్ ప్రశ్నించాడు. దీనికి స్పందించిన కోహ్లీ.. ఢిల్లీలో ఓ రాష్ట్రస్థాయి కోచ్ ద్వారా సెహ్వాగ్‌తో పరిచయం ఏర్పడిందని వివరించాడు. అండర్-17 క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన తర్వాత ఈ పరిచయం జరిగినట్లు గుర్తుచేసుకున్నాడు.
అలాగే యువకుడిగా ఉన్నప్పుడు ఆశిష్ నెహ్రా తనకు ట్రోఫీ అందించిన ఫొటో గురించి కూడా ఆర్యవీర్ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన క్రికెట్ ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నాడు. జీవితంలో పెద్ద కలలు కనాలని, తన సామర్థ్యంపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలని చిన్నారి ఆర్యవీర్‌కు సూచించాడు.
ఇవి కూడా చదవండి:
హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్.. ఎంఐ మరింత బలంగా మారింది: ఇర్ఫాన్ పఠాన్
క్రీజులో ‘సీతారామ్’ అని జపిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటా: ఆర్యవీర్ సెహ్వాగ్