Share News

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:51 PM

టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో అతడు న్యూజిలాండ్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు.

న్యూజిలాండ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అర్ష్‌దీప్ సింగ్!
Arshdeep Singh engagement

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తన ప్రేయసి సమ్రీన్ కౌర్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. అక్కడే సమ్రీన్‌కు అర్ష్‌దీప్ ప్రపోజ్ చేశాడు. అనంతరం ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సమ్రీన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ జంటకు క్రికెట్ అభిమానులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


అర్ష్‌దీప్‌తో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సమ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘హాయ్ ఫియాన్సీ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. సమ్రీన్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం. అర్ష్‌దీప్ సహచర ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, నమన్ ధీర్ కూడా ఈ జంటకు అభినందనలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్.. ఎంఐ మరింత బలంగా మారింది: ఇర్ఫాన్ పఠాన్

క్రీజులో ‘సీతారామ్’ అని జపిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటా: ఆర్యవీర్ సెహ్వాగ్

Updated Date - Nov 11 , 2026 | 05:58 PM