ఫిఫా ప్రపంచ కప్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశ్న.. చాట్‌జీపీటీ సమాధానం వైరల్!
ABN , Publish Date - Jul 10 , 2026 | 09:51 PM
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించిన వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్‌జీపీటీని అడిగారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టుకు సంబంధించి వస్తోన్న ఓ వార్త గురించి ఆయన చాట్‌జీపీటీని అడిగారు. అయితే చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన విషయాన్ని బిగ్‌బీ అభిమానులతో పంచుకున్నారు.
‘ఫిఫా ప్రపంచ కప్ 2026లో మొరాకో జట్టులోని ప్లేయర్లు ఒక్కరూ ఆ దేశంలో పుట్టలేదని ఎవరో చెప్పారు. అదే విషయాన్ని చాట్‌జీపీటీని అడిగితే.. అది పూర్తిగా నిజం కాదని సమాధానం ఇచ్చింది’ అని అమితాబ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా, ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో మొరాకో మరోసారి ఫ్రాన్స్ చేతిలో ఓడి నిరాశకు గురైంది. గత ప్రపంచ కప్ సెమీఫైనల్లో 2-0తో ఓడిన మొరాకో.. ఈసారి కూడా అదే స్కోరుతో ఫ్రాన్స్‌కు తలవంచి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్‌లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు