Share News

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!

ABN , Publish Date - May 25 , 2026 | 01:21 PM

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. వరుస ఓటముల నేపథ్యంలో అజింక్య రహానెను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అతడి పేలవ ప్రదర్శన, కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోతుందంటూ విమర్శించారు. అయితే కెప్టెన్సీ విషయంపై రహానె స్పందించాడు.

ఐపీఎల్: కేకేఆర్ కెప్టెన్సీ వివాదంపై రహానె ఏమన్నాడంటే..!
Ajinkya Rahane

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టోర్నీ ఆరంభంలో వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతూ వచ్చిన కేకేఆర్.. ఆ తర్వాత పుంజుకుంది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందనే భావించారంతా! కానీ కీలక మ్యాచుల్లో ఓడి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానెను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. అతడి పేలవ ప్రదర్శన, కెప్టెన్సీ వల్లే జట్టు ఓడిపోతుందంటూ విమర్శించారు. అయితే కెప్టెన్సీ విషయంపై రహానె స్పందించాడు.


‘జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తగ్గడం నా స్వభావం కాదు. అలాంటి సమయంలోనే వ్యక్తిత్వం బయటపడుతోంది. నాపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో కెప్టెన్సీని వదిలేయాలనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. నేను జట్టు కోసం పోరాడుతూనే ఉంటాను. సీజన్ ప్రారంభంలో తొలి ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయాం. అయితే ఆ తర్వాతి ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చాం. అయితే చివరికి అర్హత సాధించలేకపోయినా మా జట్టు ప్రదర్శన పట్ల నేను గర్వపడుతున్నా. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా సులువు. కానీ ప్రస్తుతం ఎలా గడుస్తుందనేదే ముఖ్యం. పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఈ సీజన్‌లో గాయాల కారణంగా కీలక ప్లేయర్లు దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. అయినప్పటికీ యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి.. వంటి ప్లేయర్ల ప్రయాణానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అని రహానె వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్‌నకు ముందు గాయపడ్డ మెస్సి!

ఐపీఎల్ 2026: పాపం పంజాబ్.. కలగానే మిగిలిన ‘తొలి కప్పు’!

Updated Date - May 25 , 2026 | 01:21 PM