Share News

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్

ABN , Publish Date - Aug 20 , 2026 | 07:18 PM

భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్‌, బౌన్సింగ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్‌, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు.

ఆ విషయంలో సచిన్ కంటే కోహ్లీనే బెటర్: ఏబీ డివిలియర్స్
AB de Villiers

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా విదేశీ గడ్డపై, సీమింగ్‌, బౌన్సింగ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు ఎలా రాణించాలో చూపించడంలో సచిన్‌, కోహ్లి కీలక పాత్ర పోషించారని చెప్పాడు. అయితే ఈ విషయంలో సచిన్‌ కంటే కోహ్లి మరింత ముందుకు వెళ్లి ప్రమాణాలను పెంచాడని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు.


‘సచిన్‌ టెండూల్కర్‌ చాలా కాలం క్రితమే ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. అయితే విరాట్‌ కోహ్లి సచిన్‌ కంటే మరింత బలంగా ఆ పరిస్థితుల్లో రాణించాడు. బౌన్సింగ్‌, సీమింగ్‌ పరిస్థితుల్లో ఉపఖండ బ్యాటర్‌ కూడా విజయవంతం కావచ్చని తొలిసారి చూపించింది సచిన్‌. ఆ తర్వాత విరాట్‌ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లి ప్రమాణాలను పెంచాడు. సచిన్‌, కోహ్లి విదేశీ పర్యటనల్లో సాధించిన విజయాలు ప్రస్తుత తరం భారత బ్యాటర్లకు స్ఫూర్తిగా నిలిచాయి. కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌ వంటి ఆటగాళ్లు కూడా వారి బాటలో నడుస్తూ విదేశీ పరిస్థితుల్లో తమ ఆటను మెరుగుపరుచుకుంటున్నారు’ అని ఏబీడీ వెల్లడించాడు.


రాహుల్‌ భారీ స్కోర్లపై దృష్టి పెట్టాలి..

కేఎల్‌ రాహుల్‌ టెక్నిక్‌ విషయంలో ఎంతో నమ్మకమైన ఆటగాడని, భారత జట్టుకు అతడు పెద్ద ఆస్తి అని డివిలియర్స్‌ ప్రశంసించాడు. అయితే విదేశీ గడ్డపై అతడి సగటు 34 పరుగుల వద్దే ఉండటంపై మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని సూచించాడు. ‘కేఎల్‌ రాహుల్‌కు మంచి టెక్నిక్‌ ఉంది. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అతడు కీలక ఆటగాడు. కానీ విదేశాల్లో అతడి సగటు 34 మాత్రమే. అందుకే అతడి నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తాం. ఒకసారి క్రీజులో కుదురుకున్న తర్వాత సెంచరీతో ఆగిపోకుండా 180 పరుగుల వంటి భారీ స్కోర్లు సాధించాలి. కొత్త బంతితో ఔటయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. రాహుల్‌ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చుకోవడమే తదుపరి లక్ష్యంగా ఉండాలి’ అని ఏబీ డివిలియర్స్ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 20 , 2026 | 07:18 PM