పాకిస్థాన్‌కు ఊరట.. గడాఫీ స్టేడియంపై డీమెరిట్ పాయింట్ ఎత్తివేసిన ఐసీసీ
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:35 PM
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌పై విధించిన డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గురువారం రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఊరట లభించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం పిచ్‌పై విధించిన డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ గురువారం రద్దు చేసింది. జూన్ 4న పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డేలో గడాఫీ స్టేడియం పిచ్‌కు మ్యాచ్ రిఫరీ ‘అసంతృప్తికరం’ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ పిచ్ అండ్ అవుడ్ ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ కింద స్టేడియానికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అప్పీల్ చేయడంతో ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ మ్యాచ్ వీడియో ఫుటేజ్, మ్యాచ్ రిఫరీ నివేదిక, ఇరు జట్ల కెప్టెన్ల అధికారిక వ్యాఖ్యలను పరిశీలించింది. విచారణ అనంతరం మ్యాచ్ రిఫరీ మార్గదర్శకాలను సరిగ్గానే అనుసరించారని ప్యానెల్ పేర్కొంది. అయితే పిచ్ ‘అసంతృప్తికరం’గా రేటింగ్ ఇవ్వాల్సిన స్థాయిలో లేదని తేల్చింది. పిచ్‌లో అధిక అసమానతలు, అతిగా స్పిన్ లభించినట్లు ఆధారాలు కనిపించలేదని స్పష్టం చేసింది. దీంతో గడాఫీ స్టేడియంపై విధించిన డీమెరిట్ పాయింట్‌ను రద్దు చేసింది.
కెనడా స్టేడియానికీ ఊరట.. కానీ!
కెనడాకు చెందిన మ్యాపుల్ లీఫ్ క్రికెట్ గ్రౌండ్‌కు సంబంధించిన రెండు అప్పీళ్లను కూడా ఐసీసీ అప్పీల్స్ ప్యానెల్ పరిశీలించింది. జూన్ 8న అమెరికా–నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఐసీసీ పురుషుల ప్రపంచకప్ లీగ్-2 మ్యాచ్‌లో ఈ మైదానం పిచ్‌కు ‘అసంతృప్తికరం’ రేటింగ్ వచ్చింది. అయితే ఈ పిచ్ సాధారణ ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని ప్యానెల్ గుర్తించింది. అధిక అసమానతలు, సీమ్ కదలిక లేదా అధిక స్పిన్ కనిపించలేదని పేర్కొంటూ ఆ మ్యాచ్‌కు సంబంధించిన డీమెరిట్ పాయింట్‌ను కూడా ఉపసంహరించింది. అయితే జూన్ 16న కెనడా-నెదర్లాండ్స్ మ్యాచ్ సందర్భంగా పిచ్‌కు ‘అన్‌ఫిట్’ రేటింగ్ ఇచ్చి విధించిన మూడు డీమెరిట్ పాయింట్లు మాత్రం కొనసాగనున్నాయి. ఆ మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, అందువల్ల ‘అన్‌ఫిట్’ రేటింగ్ సరైనదేనని అప్పీల్స్ ప్యానెల్ తేల్చింది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు