Viral Video: మరిది పెళ్లి ఊరేగింపులో ఫారిన్ వదిన అదిరిపోయే డ్యాన్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:37 PM
మన దేశంలో పెళ్లి తర్వాత జరిగే బారాత్ లో వధూవరుల బంధువులు, స్నేహితులు చేసే హంగామా ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. డీజే సౌండ్స్, బాంబుల మోత, డ్యాన్స్ హంగామాతో ఎంతో కోలాహలంగా ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి బారాత్ అంటే ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెళ్లి బారాత్ జీవితకాలంలో మరిచిపోలేని విధంగా జరుపుకుంటుంటారు. అలాంటిదే ఇప్పుడు ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తన మరిది పెళ్లి ఊరేగింపులో విదేశీ మహిళ.. బాలీవుడ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైరల్ అవుతున్న వీడియో @zindagi.gulzar.h అనే హ్యాండిల్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వరుడు భారతీయుడు, వధువు జర్మనీకి చెందిన మహిళగా తెలుస్తోంది. వరుసకు మరిదైన యువకుడి పెళ్లి బారాత్‌లో ఫారిన్ మహిళ భారతీయ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా నృత్యం చేసింది.
బాలీవుడ్ హిట్ మూవీ ‘హమ్ ఆప్కే హై కౌన్’ మూవీలో ‘లో చలి మైన్’ పాటకు డ్యాన్స్ చేసింది సదరు యువతి. ఆ సమయంలో బంధువులు, స్నేహితులు ఆమెను ఎంతో ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొట్టారు. ఆ మహిళకు హిందీ తెలియకపోయినా హిందీ పాటలకు అద్భుతంగా నృత్యం చేయడం నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు ఎంతో పాజిటీవ్ గా స్పందించారు. ఒక నెటిజన్ ‘నేను స్క్రీన్ పై అద్భుతమైన వివాహమహోత్సవం చూశాను.. మంచి అనుభూతి కలిగింది’ అంటూ రాసుకొచ్చారు.
ఇవీ చదవండి:
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..
గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..