వావ్..! ఈ రోబో ఫైటింగ్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:20 PM
రోబో అనగానే హోటళ్లలో సర్వ్ చేయడం, రోడ్లపై డాన్సులు చేయడం వంటి పనులే గుర్తుకొస్తాయి. అయితే తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ రోబో ఫైటింగ్ చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..
రొబోటిక్స్ రంగాల్లో రోజురోజుకూ వస్తున్న మార్పులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒకప్పుడు పరిశ్రమలకే పరిమితమైన రోబోలు.. ఇప్పుడు మనుషుల్లా నడవడం, పరుగెత్తడం, విన్యాసాలు చేయడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. తాజాగా ఓ రోబో చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. చుట్టుముట్టిన మనుషులతో రోబో తలపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకూ నిజమో తెలీదు గానీ.. తెగ చక్కర్లు కొడుతోంది..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపక్కన కొందరు యువకులు ఓ హ్యూమనాయిడ్ రోబో చుట్టూ చేరారు. మొదట వారు రోబోను సరదాగా ఆట పట్టించారు. ఓ యువకుడు రోబోను ముందుకు తోస్తే.. మరో వ్యక్తి కొట్టే ప్రయత్నం చేశాడు. ఇంకో వ్యక్తి ఏకంగా రోబోను వెనుక వైపు నుంచి కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. ఇలా వారంతా కలిసి ఆ రోబోను రెచ్చగొడుతూ ఆటపట్టించారు. దీంతో రోబోకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకున్నట్లుంది.
‘నాతోనే పరాచకాలా.. ఉండండి మీ పని చెబుతా’.. అని అన్నట్లుగా ఆ రోబో ఒక్కసారిగా వారిపై తిరగబడుతుంది. అందరినీ టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరి వైపు పంచ్ విసురుతూ భయపెడుతుంది. ఆ సమయంలో ఏమాత్రం రోబో దగ్గరికి వచ్చినా దాని పంచ్‌కు చుక్కలు కనిపించేవి. అయితే రోబో తిరగబడడం చూసి వారంతా భయంతో దూరంగా నిలబడతారు. ఇలా ఆ రోబో వారందరితో ఓ ఆట ఆడుకుంటుంది. అయితే కొందరు ఇది ఏఐ అని కొట్టిపారేస్తుండగా.. మరికొందరు రోబో ఫైట్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వావ్.. ఈ రోబో టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘సినిమాల్లో హీరోను మించిపోయిందిగా’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పక్షవాతం నటించి భిక్షాటన.. చివరికి ఏమైందో మీరే చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..