రెండేళ్లకే తబలాపై 12 తాళాలు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కర్ణాటక చిన్నారి
ABN , Publish Date - Oct 25 , 2026 | 04:31 PM
రెండేళ్ల 10 నెలల వయసులోనే తబలాపై 12 రకాల తాళాలను లయబద్ధంగా వాయిస్తూ కర్ణాటక చిన్నారి స్వరశ్రీ హెగ్డే అద్భుతం సృష్టించింది.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 25: కర్ణాటకకు చెందిన 2 ఏళ్ల 10 నెలల చిన్నారి స్వరశ్రీ హెగ్డే (Swarshri Hegde) తన అద్భుతమైన సంగీత ప్రతిభతో 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్' లో చోటు దక్కించుకుంది. తబలాపై 12 రకాల తాళాలను స్వరబద్ధంగా వాయిస్తూ, నోటితో ఆ తాళాల బోల్స్ (పదాలను) పలుకుతూ ఈ చిన్నారి సృష్టించిన రికార్డ్ అందర్నీ అబ్బురపరుస్తోంది.
ఉత్తర కన్నడ జిల్లాలోని హొన్నావర ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి.. తబలాపై వేళ్లతో సరైన శబ్దాలు పలికిస్తూ, లయ తప్పకుండా 12 తాళాలు వాయించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిన్నారిపై సరస్వతీ దేవి అపారమైన అనుగ్రహం ఉందంటూ కొందరు, ఆమె తల్లిదండ్రులు పాపకు 'స్వరశ్రీ' అని పేరు పెట్టడం నిజంగా అద్భుతమని మరొకొందరు, ఈ పాప తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే సాధన ప్రారంభించిందేమోనని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.(Swarshri Hegde Tabla Record)
ఈ వార్తలు కూడా చదవండి..
గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క
ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News