గోధుమలను పక్షుల నుంచి కాపాడే సింపుల్ ట్రిక్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:18 PM
గోధుమలపై పక్షుల దాడి నుంచి కాపాడుకునేందుకు ఓ మహిళ చేసిన వినూత్నమైన ఐడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారతదేశంలో చాలామంది మార్కెట్‌లో దొరికే పిండిని కొనుగోలు చేయకుండా నేరుగా గోధుమలను కొనుగోలు చేసి వాటిని కడిగి, ఆరబెట్టి, ఆ తర్వాత పిండి చేయించుకుని రొట్టెలు తయారు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కల్తీలేని, నాణ్యమైన గోధుమ పిండి లభిస్తుందనే నమ్మకం ఉంది. అయితే గోధుమలను కడిగిన తర్వాత వాటిని ఆరబెట్టడం మాత్రం అంత సులభమైన పనికాదు. పైకప్పులపై లేదా ఓపెన్ ప్లేస్‌లో ఆరబెట్టిన గోధుమలపై పావురాలు, ఇతర పక్షులు వాలడం వల్ల చెల్లాచెదురవడం లేదా నష్టం జరగడం సాధారణంగా కనిపించే సమస్య. ఈ సమస్యకు ఒక సులభమైన పరిష్కారాన్ని చూపే ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
నిక్కీ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇంటి పైకప్పుపై ఆరబెట్టిన గోధుమల మధ్యలో ఓ పిల్లి కూర్చున్నట్లు కనిపిస్తుంది. మొదటిసారిగా అది నిజమైన పిల్లిలా అనిపించినప్పటికీ.. దగ్గరగా చూస్తే అదో బొమ్మ అని తెలుస్తుంది. పక్షులు పిల్లిని చూసి భయపడతాయనే ఉద్దేశంతో ఈ బొమ్మను గోధుమల మధ్య ఉంచారు. దీంతో పావురాలు, ఇతర పక్షులు గోధుమల దగ్గరకు రాకుండా ఉండటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గోధుమలను ఆరబెట్టే సమయంలో పక్షుల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చిన్న ట్రిక్ ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ఖర్చుతో, ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే గోధుమలను కాపాడుకునే ఈ ఆలోచన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి...
ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత
అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News