Share News

హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్‌ మ్యాన్‌ సూర్య భాయ్ అరెస్ట్

ABN , Publish Date - Jun 27 , 2026 | 02:22 PM

గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను సూర్య భాయ్ బురిడీ కొట్టించాడు.

హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు యత్నం.. గోల్డ్‌ మ్యాన్‌ సూర్య భాయ్ అరెస్ట్
Gold Man Surya Bhai

హైదరాబాద్, జూన్ 27: గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌ పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను సూర్య భాయ్ బురిడీ కొట్టించాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఏకంగా బాధితులపై కేసు పెట్టాడు. చివరకు అసలు రంగు బయటపడటంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గోల్డ్ మ్యాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇదీ జరిగింది..

తక్కువ ధరకే విదేశీ బంగారం ఇస్తానంటూ అమాయకుల నుంచి సూర్య భాయ్ లక్షలాది రూపాయలను వసూలు చేసి భారీ మోసానికి తెరతీశాడు. గోల్డ్ మ్యాన్ మాటలు నమ్మి హిమాయత్‌నగర్‌, నీలోఫర్‌‌‌కు చెందిన బాధితులు దాదాపు రూ.30 లక్షలు ఇచ్చారు. అయితే బంగారం ఇవ్వకపోవడంతో సూర్య ఇంటికి వెళ్లిన బాధితులు.. తమ డబ్బులు తమకు తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీంతో తన వద్ద ఉన్న మూడు ఐఫోన్లను ఇచ్చి వాటి విలువ రూ.10 లక్షలు అని, అలాగే రూ.20 లక్షల చెక్ ఇచ్చి బాధితులను పంపించేశాడు.


అనంతరం బాధతులపైనే సూర్య భాయ్ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బెదిరించి ఫోన్ లాక్కెల్లారంటూ సూర్య భాయ్ పోలీసులకు తెలిపాడు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు. తక్కువ ధరకే బంగారం పేరుతో సూర్య భాయ్ మోసం చేశారంటూ అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును నారాయణగూడ పీఎస్‌కు బదిలీ చేశారు. అయితే అరెస్ట్ భయంతో సూర్య భాయ్ హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా షాద్‌నగర్‌లో పోలీసులు పట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి...

అమెరికాకు తగిన బుద్ధి చెబుతాం.. దాడులపై ఇరాన్ ఆగ్రహం..

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం: మంత్రి పొన్నం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 03:34 PM