Share News

వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:16 PM

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు.

వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశం.. భావోద్వేగంతో కన్నీళ్లుపెట్టుకున్న రైతులు
CM Chandrababu Naidu

మార్కాపురం, జూన్ 27: వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి సమావేశానికి రైతులు తరలివచ్చారు. పొలాల మధ్య రైతులు, నిర్వాసితులతో సీఎం సమావేశమయ్యారు. రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేలా కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు.


30 ఏళ్ల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామంటూ.. రైతులు కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఆర్ అండ్ ఆర్ కూడా సకాలంలో అందించేలా చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని వెలిగొండ నిర్వాసితులు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును రైతులు కోరారు. ఈ సమావేశానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, డీబీవీ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

సీఎం చంద్రబాబు, లోకేశ్ గురించి మాట్లాడితే అంతు చూస్తాం: జేసీ ప్రభాకర్

వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు.. కానీ: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 01:19 PM