Share News

ఐస్‌క్రీమ్ కోసం బాల్కనీ నుంచి వేలాడిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్

ABN , Publish Date - Jun 27 , 2026 | 03:18 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బాల్కానీ నుంచి ఐస్‌క్రీమ్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే...

ఐస్‌క్రీమ్ కోసం బాల్కనీ నుంచి వేలాడిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
Man Falls from Balcony

ఇంటర్నెట్ డెస్క్: ఒక పనిని త్వరగా పూర్తి చేయాలనే ఆత్రుతలో చేసే చిన్న పొరపాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని క్షణాల సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.


సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రేణుకుట్ నగర్‌లో ఓ వ్యక్తి తన ఇంటి బాల్కనీ నుంచి కిందున్న ఐస్‌క్రీమ్ విక్రేత వద్దకు వెళ్లకుండా నేరుగా బాల్కనీ నుంచి వేలాడుతూ ఐస్‌క్రీమ్ తీసుకునేందుకు యత్నించాడు. అయితే ఐస్‌క్రీమ్ అందుకున్న వెంటనే అతను పట్టు కోల్పోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఈ దృశ్యం అక్కడున్నవారిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. అతను కిందపడిన వెంటనే బాల్కనీలోకి ఓ మహిళ రావడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే ఆమె ఎలాంటి ఆందోళన చెందకుండా.. ఎంచక్కా ఫోన్ మాట్లాడుతూ ఉండటం, చివరకు నెమ్మదిగా కిందకు దిగడం వంటి దృశ్యాలు చర్చకు దారితీసింది. ఆమె ప్రవర్తనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని రేవంత్ ఎగిరెగిరిపడుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

మన వాళ్ల హక్కులను కాపాడటంలో వెనక్కు తగ్గేదేలే..: కవిత

Updated Date - Jun 27 , 2026 | 04:26 PM