Share News

స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..!

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:18 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి లోదుస్తుల్లోకి పాము దూరడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే.

స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి లోదుస్తుల్లోకి దూరిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..!
Snake in Swimming Pool

ఇంటర్నెట్ డెస్క్: ఓ స్విమ్మింగ్ పూల్‌లో యువకుడి లోదుస్తుల్లోకి పాము దూరడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. ఒక యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా.. ఊహించని విధంగా ఓ పాము అతని లోదుస్తుల్లోకి ప్రవేశించింది. లోపల ఏదో కదులుతున్నట్లు గమనించిన ఆ యువకుడు, అది పాము అని తెలుసుకుని తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు. అక్కడున్న స్నేహితులు మొదట కంగారు పడినా, వెంటనే అప్రమత్తమై సహాయం చేశారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితిలో స్నేహితులు చూపిన సమయస్ఫూర్తి వల్ల సదరు యువకుడు త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు స్విమ్మింగ్ ‌పూల్‌లో నిలబడి తీవ్ర ఆందోళనతో కనిపిస్తుండగా, అతని స్నేహితులు పామును బయటికి తీసేందుకు సాయం చేశారు. చివరకు అతి కష్టం మీద పామును బయటికి తీశారు. అయితే ఈ ఘటనలో ఆ యువకుడికి ప్రమాదమేమీ జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!

అయోధ్య నిధుల దుర్వినియోగం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా..

Updated Date - Jun 26 , 2026 | 04:18 PM