ఫొటోల కోసం ఫోజులిస్తే.. అలలు ప్రాణాలు తీశాయి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:02 PM
ఓ యువకుడు గోవా బీచ్‌లో ఎంజాయ్ చేయాడానికి వెళ్లి రాకాసి అలలకు బలైన సంఘటన తీవ్ర కలకం రేపింది. ఫొటో సరదా అతని ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: ఓ యువకుడు గోవా బీచ్‌లో ఎంజాయ్ చేయాడానికి వెళ్లి రాకాసి అలలకు బలైన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఫొటో సరదా అతని ప్రాణాలు తీసింది. సముద్ర తీరంలో గడపడం, అలల సందడిని ఆస్వాదించడం, ఆ మధుర జ్ఞాపకాలను కెమెరాలో బంధించుకోవడం ఎవరికైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దేశంలో అద్భుతమైన పర్యాటక కేంద్రంగా పేరొందిన గోవాకు వెళ్లే ప్రతి పర్యాటకుడూ ఇలాంటి ఆహ్లాదకరమైన క్షణాల కోసమే పరితపిస్తాడు. అయితే, కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతటి ఘోరం జరుగుతుందో చెప్పడానికి గోవాలోని ‘బాగా బీచ్’లో జరిగిన ఒక సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఓ వ్యక్తి ఫొటో సరదా ప్రాణాలు తీసింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన 33 ఏళ్ల అష్పక్ మసాలీ అనే యువకుడు సముద్రంలో అలల ఉధృతి చాలా బలంగా ఉన్న సమయంలో.. ఒక బండరాయిపై కూర్చుని ఫొటోలు దిగడానికి ప్రయత్నించాడు. అతని స్నేహితుడు దూరం నుంచి ఫొటో తీస్తున్న సమయంలోనే అలల ఉధృతి బాగా పెరిగిపోయింది. దాంతో అష్పాక్ మసాలీ ఆ బండరాయి పైనుంచి కిందికి దిగబోతుండగా, ఒక్కసారిగా ఎగసిపడిన ఒక భారీ అల అతడిని బలంగా తాకింది. బండరాయిపై కాలు జారడంతో తనను తాను నియంత్రించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రమాదాన్ని గ్రహించి అతను ఒడ్డుకు రావడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అలలు అతన్ని సముద్రంలోకి లాగేశాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అతను నీట మునిగి ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
80 ఏళ్ల వయసులో కళాకారుడి కష్టాలు.. వీడియో చూసి చలించిపోయిన ఆనంద్ మహీంద్ర..
పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..