Share News

ఆఖరికి ఇందులోకీ ఎంటరైందిగా.. ఈ రోబో నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:37 PM

టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కంగారుపడుతున్న ఈ రోజులివి. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి వినూత్నం ప్రయోగం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, రోబో ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..

ఆఖరికి ఇందులోకీ ఎంటరైందిగా.. ఈ రోబో నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
Humanoid Robot Begging

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కంగారుపడుతున్న ఈ రోజులివి. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి వినూత్నం ప్రయోగం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, చైనాలో జరిగిన ఒక విచిత్రమైన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా రోబోలు ఫ్యాక్టరీల్లో పనిచేయడం, వంట చేయడం లేదా హోటళ్లలో సర్వ్ చేయడం చూసుంటాం. కానీ, చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఫుట్‌పాత్‌పై మోకాళ్లపై కూర్చుని మరీ భిక్షాటన చేస్తూ అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో.. ఓ హ్యూమనాయిడ్ రోబోట్ మోకాలిపై కూర్చుని, దారిపోయే బాటసారులకు చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించింది. అంతటితో ఆగకుండా, తన ముందర నగదు వేయడానికి ఒక చిన్న ప్లేట్‌ను, ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ఒక క్యూఆర్ కోడ్‌ను కూడా సిద్ధంగా ఉంచుకుంది. దానికి తోడు ఒక ఎల్ఈడీ సైన్ బోర్డు, లౌడ్‌స్పీకర్‌ను అమర్చి, వాటి ద్వారా ‘రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు.. దయచేసి కరెంట్ బిల్లు కట్టడానికి సహాయం చేయండి’ అంటూ వినూత్నంగా యాచిస్తోంది. ఈ రోబోట్‌ను చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ 'యూనిట్రీ' తయారు చేసినట్లు గుర్తించారు. దీని మోడల్ పేరు 'యూనిట్రీ జి1'. గతంలో ఈ కంపెనీకి చెందిన మరో రోబోట్ ఈక్వెడార్‌లోని ఒక అగ్నిపర్వతాన్ని అధిరోహించి వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ జీ1 రోబోట్ ఇలా రోడ్డుపై అడుక్కోవడం వెనుక అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి

యోగాలో పాల్గొన్న ఏనుగులు.. నెట్టింట వీడియో వైరల్..

క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..

Updated Date - Jun 24 , 2026 | 04:09 PM