యోగాలో పాల్గొన్న ఏనుగులు.. నెట్టింట వీడియో వైరల్..
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:19 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రకృతి అందాల నడుమ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టోర్సా నది పక్కన పలువురు అటవీశాఖ అధికారులు చాపలు పరుచుకుని యోగా సాధన చేశారు. అయితే, ఈ యోగా కార్యక్రమంలో ఏనుగులు కూడా పాల్గొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా నిన్న (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవం-2026 చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో ఆయన వేలాది మందితో కలిసి ఆసనాలు వేశారు. అయితే, ఇదే రాష్ట్రంలో నిన్న మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అటవీశాఖ సిబ్బందితో కలిసి ఏనుగులు యోగాలో పాల్గొన్నాయి. ఈ వీడియో నెట్టింట పలువురిని ఆకర్షించి వైరల్‌గా మారింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రకృతి అందాల నడుమ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టోర్సా నది పక్కన పలువురు అటవీశాఖ అధికారులు చాపలు పరుచుకుని యోగా సాధన చేశారు. పలు రకాల ఆసనాలు వేస్తూ యోగా ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ఇదే సమయంలో వారితో పాటు ఆరు ఏనుగులు యోగా కార్యక్రమంలో పాల్గొన్నాయి. యోగా చేస్తున్న అధికారుల పక్కన టోర్సా నదిలో ఏనుగులు నిలబడి ఉన్నాయి. అటవీశాఖ సిబ్బంది వాటిపై కూర్చొని ఉండగా.. తొండం, చెవులు ఊపుతూ హుషారుగా యోగాలో పాల్గొన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
లవ్ అండ్ వార్ సినిమా షూటింగ్‌లో విషాదం.. సినీ కార్మికుడి కన్నుమూత..
క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..