Share News

వామ్మో.. ఇదేం ఇల్లురా బాబూ! యువతులకు షాక్

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:47 PM

ఒక అద్దె ఇంటిని పరిశీలించేందుకు వెళ్లిన ఇద్దరు యువతులు అక్కడ బాల్కనీలోని ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వామ్మో.. ఇదేం ఇల్లురా బాబూ! యువతులకు షాక్
Toilet in Balcony

ఇంటర్నెట్ డెస్క్: కావాల్సిన వసతులు అన్నీ ఉన్న అద్దె ఇల్లు దొరకడం ఈ కాలంలో ఎంతో కష్టం. ఇక బెంగళూరు వంటి నగరాల్లో పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ నేపథ్యంలో అద్దె ఇళ్ల కోసం వెతుకులాట ప్రారంభించిన ఇద్దరు యువతులకు బెంగళూరులో తాజాగా వింత పరిస్థితి ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

త్రిష అనే యువతి ఈ వీడియోను షేర్ చేశారు. ఒక అద్దె ఇంటిని పరిశీలించేందుకు వెళితే వింత దృశ్యం కనిపించిందని అన్నారు. బాల్కనీలో పూల మొక్కలు వంటివి ఉంటాయనుకుంటే అక్కడ కమ్మోడ్ కనిపించిందని కడుపుబ్బా నవ్వారు. అదేమీ మూలన పడేసిన కమ్మోడ్ కాదని చెప్పారు. వాడుకునేందుకు వీలుగా దాన్ని కావాలనే అక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. కమ్మోడ్ పక్కన ఉన్న పైపుల్లోంచి నీళ్లు కూడా వస్తున్నాయని చెప్పారు.


ఇక వీడియోపై జనాల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ వింత ఏర్పాటును చూసి అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవసీ అనేదే ఉండని బాల్కనీలో కమ్మోడ్‌‌ను ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదని కొందరు అన్నారు. మంచి వెంటిలేషన్ ఉందని మరికొందరు సెటైర్లు పేల్చారు. జనాలు దిమ్మెరపోయేలా చేసే అంశాలకు బెంగళూరులో కొదవే లేదని కొందరు ముక్తాయించారు.


ఈ వార్తలనూ చదవండి

అమెరికా పోలీసు కాల్పులు.. పెంపుడు కుక్క మరణం.. షాకింగ్ వీడియో

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..

Updated Date - Jun 21 , 2026 | 05:08 PM