Share News

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:08 PM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రష్‌తో సమోసాలపై నారింజ రంగు పూస్తున్నట్లు కనిపిస్తోంది.

వామ్మో.. సమోసాలకు రంగులేస్తున్నారా.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనా..
Samosa Viral Video

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రష్‌తో సమోసాలపై నారింజ రంగు పూస్తున్నట్లు కనిపిస్తోంది. అందురూ ఎంతో ఇష్టంగా తినే సమోసాలకు ఇలా కృతిమంగా రంగులేస్తున్నారని, ఆరోగ్యంతో ఆటలాడుతున్నారని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వీడియో విషయంలో కొందరు క్లారిటీ ఇచ్చారు (Samosa Colour Video).


వీడియోలో కనిపిస్తున్నవి తినే సమోసాలు కాదని, ప్రదర్శన కోసం తయారు చేసిన అలంకరణ వస్తువులని పలువురు నెటిజన్లు క్లారిటీ ఇచ్చారు. అవి నిజమైన సమోసాల్లా కనిపించే నమూనాలు మాత్రమేనని, వాటికి రంగులు వేస్తున్న దృశ్యమే వైరల్ అయిందని వివరణ ఇచ్చారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక వ్యక్తి చుట్టూ సమోసా ఆకారంలో ఉన్న అనేక వస్తువులు ఉన్నాయి. కొన్ని సమోసాలు లేత రంగులో ఉండగా, మరికొన్ని అప్పుడే వేయించిన సమోసాల వలె బంగారు గోధుమ రంగులో ఉన్నాయి (Samosa Viral Video).


ఒక వ్యక్తి బ్రష్‌తో ఆ సమోసాలకు రంగు వేస్తున్నాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ అయింది (Food Adulteration). దాదాపు 2.7 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. కాగా, ఈ ఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో కనిపిస్తున్న వస్తువులు నిజంగా ఏమిటి? అనే విషయాలపై అధికారిక సమాచారం ఇప్పటివరకు వెలువడలేదు.


ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 21 , 2026 | 01:09 PM