Share News

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..

ABN , Publish Date - Jun 21 , 2026 | 10:33 AM

ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

రెండు మార్కులతో జేఈఈ కోల్పోయాడు.. ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు..
Sanket Kumar ISRO

ఒకప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం 2 మార్కుల తేడాతో అర్హత సాధించలేక నిరాశకు గురైన విద్యార్థి, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శాస్త్రవేత్తగా ఎంపికై అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సంకేత్ కుమార్ పట్టుదల, కృషితో ఈ ఘనత సాధించాడు. సంకేత్ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Sanket Kumar ISRO).


2021లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో కేవలం రెండు మార్కుల తేడాతో సంకేత్ అర్హత కోల్పోయాడు. అతడి సన్నిహితులు ఒక సంవత్సరం వృథా కానివ్వొద్దని, వేరే కోర్సులో జాయిన్ కావాలని సూచించారు. అయితే సంకేత్ తన లక్ష్యాన్ని వదల్లేదు. ఖరీదైన శిక్షణ కేంద్రాలకు వెళ్లకుండా ప్రధానంగా యూట్యూబ్ పాఠాలు, స్వయంకృషితోనే మళ్లీ సిద్ధమయ్యాడు. తదుపరి సంవత్సరం జేఈఈ అడ్వాన్స్డ్‌లో విజయాన్ని సాధించి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రవేశం పొందాడు (JEE Advanced Success Story).


అక్కడ ప్రొపల్షన్‌కు సంబంధించిన ప్రత్యేక విభాగాన్ని ఎంచుకుని లోతుగా అధ్యయనం చేశాడు (ISRO Scientist Selection). జపాన్‌లో ఒక పరిశోధన ప్రాజెక్ట్‌లో కూడా పాల్గొని విలువైన అనుభవాన్ని సంపాదించాడు. తన ప్రతిభ, పరిశోధన అనుభవంతో సంకేత్ తాజాగా ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. కేవలం రెండు మార్కులతో జేఈఈ అవకాశం కోల్పోయిన విద్యార్థి, ఇప్పుడు దేశ అంతరిక్ష కార్యక్రమంలో భాగస్వామి కావడం అనేక మంది విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 21 , 2026 | 11:18 AM