షాకింగ్ వీడియో.. ఫోన్ చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.. గుండెపోటుతో చనిపోయాడు..
ABN , Publish Date - Jun 21 , 2026 | 09:09 AM
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కబ్బన్‌పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Bengaluru Mobile Snatching).
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జునైద్, అర్బాజ్ అనే ఇద్దరు యువకులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఓ వ్యక్తి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారు. బాధితుడు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న ఓ కార్మికుడు తన వద్ద ఉన్న బరువైన సంచిని వారి బైక్‌పై విసిరాడు. దీంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. బైక్, మొబైల్ అక్కడే వదిలేసి ఇద్దరూ పారిపోయారు. కొంతదూరం పరుగెత్తిన తర్వాత జునైద్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు (Mobile Theft Case).
గుండెపోటు కారణంగా జునైద్ క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయాడు (Bengaluru Crime News). జునైద్‌కు ముందుగానే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి గతంలో గుండె చికిత్స కూడా జరిగినట్లు సమాచారం. మరో నిందితుడు అర్బాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
మెకానిక్ కోతి.. సైకిల్‌కు ఎలా పంక్చర్ వేస్తోందో చూడండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..