మురికి నీళ్లలో ఆకు కూరల్ని కడిగిన వ్యాపారి.. మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Jun 25 , 2026 | 06:51 PM
ఓ ఆకు కూరల వ్యాపారి ఆకు కూరల కట్టలను మురికి నీళ్లతో కడిగాడు. మురికి నీళ్లతో కడిగిన ఆ ఆకు కూరలను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాడు.
ఇంటర్‌నెట్ డెస్క్: కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం కస్టమర్ల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు నీచమైన పనులు చేస్తున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఓ ఆకు కూరల వ్యాపారి ఆకు కూరల కట్టలను మురికి నీళ్లతో కడిగాడు. మురికి నీళ్లతో కడిగిన ఆ ఆకు కూరలను నేరుగా మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టాడు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే .. నీటి గుంత దగ్గర పెద్ద మొత్తంలో ఆకు కూరల కట్టలు ఉన్నాయి. ఓ వ్యక్తి నీటి గుంతలో నిలబడి ఆకు కూరల కట్టలను నీటిలో ముంచి కడిగి బయటకు తీసి పెడుతున్నాడు. ఆ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి. నీటిపై పాచి కూడా తేలి ఉంది. ఆ వ్యక్తి బురద నీటిలోనే ఆకు కూరల కట్టలను శుభ్రం చేసి గట్టుపై పెడుతున్నాడు. వీడియో తీస్తున్న వ్యక్తి మురికి నీటిలో ఆకు కూరలను కడగడంపై విచారం వ్యక్తం చేశాడు. ‘నోయిడా ప్రజలారా ఓ సారి ఇలా చూడండి. మీరు తింటున్న ప్రొటీన్ రిచ్ ఆహారం ఇదే. కూరగాయల్ని ఎలా శుభ్రం చేస్తున్నారో చూడండి’ అని వాపోయాడు.
మురికి నీటిలో ఆకు కూరలు కడుగుతున్న వ్యక్తి వీడియో తీస్తున్నాడన్న భయం లేకుండా తన పనిని కొనసాగించాడు. పైగా కెమెరా వైపు తిరిగి నవ్వాడు కూడా. వీడియో తీసిన వ్యక్తి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘గేదెలు మూత్రం పోసిన నీటిలో కూరగాయల్ని కడుగుతున్నాడు. అతడికి కొంచెం కూడా భయం లేదు’..‘ఇలాంటి వారిని ఊరికే విదిలిపెట్ట కూడదు’..‘నోయిడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
షాకింగ్ వీడియో.. బాల్కనీలో నిలబడి ఐస్ క్రీమ్ అందుకుంటుండగా..
భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి నేటికి 43 ఏళ్లు