ఫ్రాన్స్‌లో భానుడి భగభగలు.. ఏసీల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:27 PM
ఫ్రాన్స్‌లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మాల్‌లో ఏసీల కొనుగోలు కసం పోటీ పడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ మాల్‌లో ఏసీల కొనుగోలు కోసం పోటీ పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఐరోపా ఖండం తీవ్రమైన ఎండ తీవ్రతతో అతలాకుతలమవుతోంది. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన వేడి కారణంగా పలు మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో పాఠశాలల మూసేశారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాపై కూడా దీని ప్రభావం పడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్రాన్స్ దేశంలోనైతే అధికారులు అత్యున్నత స్థాయి హీట్ అలర్ట్‌లను జారీ చేశారు. జూన్‌లోనే కాకుండా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ ఉష్ణోగ్రత రికార్డులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రికార్డు స్థాయి వేడి కారణంగా ఫ్రాన్స్‌లో ఎయిర్ కండిషనర్ల (ఏసీలు) వినియోగంపై కొంత కాలంగా జరుగుతున్న ఒక పెద్ద చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఫ్రాన్స్ దేశం చాలా కాలంగా ఏసీల వాడకాన్ని విస్తృతం చేయడానికి సుముఖంగా లేదు. కానీ ఇప్పుడు ఎండలు తారాస్థాయికి చేరడంతో, అక్కడి ప్రజలు ఈ ఉక్కపోత నుంచి తట్టుకోవడానికి ఫ్యాన్లు, పోర్టబుల్ ఏసీలను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలలో.. స్టోర్లు తెరవగానే జనాలు లోపలికి దూసుకెళ్లడం, షెల్ఫ్‌లలో ఉన్న కూలింగ్ పరికరాలను దక్కించుకోవడానికి ఒకరినొకరు నెట్టుకుంటూ పోటీ పడటం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
అయోధ్య నిధుల దుర్వినియోగం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా..
సనాతన ధర్మ నమ్మకంతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం: CM యోగి ఆదిత్యనాథ్