రూ.10 నాణేలతో బైక్ కొనుగోలు చేసిన రఘుపతి.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:07 PM
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి బైక్ కొనుగోలు చేశారు. అందుకు అవసరమైన రూ.1.10 లక్షల మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో చెల్లించారు.
ఇంటర్నెట్ డెస్క్: కొంత మంది తాము చేసే పని వినూత్నంగా ఉండాలని భావిస్తారు. అలా చేయడంతో వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా బైక్ కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మార్గంతో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి బైక్ కొనుగోలు చేశారు. అందుకు అవసరమైన రూ.1.10 లక్షల మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో చెల్లించారు.
ఈ బైక్ కొనడం కోసం చాలా కాలంగా ఆయన రూ.10 నాణేలను పొదుపు చేస్తూ వచ్చారు. అలా దాచిన నగదును అంతా కవర్లలో నింపుకుని బైక్ షోరూమ్‌కు వెళ్లారు. ఈ నగదు చెల్లించి తనకు ఇష్టమైన స్ల్పెండర్ ప్లస్ బైక్‌ను ఆయన కొనుగోలు చేశారు. షోరూమ్‌లోని సిబ్బంది అంతా కలిసి ఈ నగదును లెక్కించారు.
ఈ నగదు లెక్కించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందించారు. కొండే రఘుపతి పొదుపుతోపాటు పట్టుదలను వారు అభినందించారు. నగదు లెక్కించిన షోరూమ్ సిబ్బందికి సెల్యూట్ చేశారు నెటిజన్లు.
ఇవి కూడా చదవండి..
లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
For More Viral News And Telugu News