20 లీటర్ల పాలతో బాలీవుడ్ నటుడి స్నానం.. వింత రూమర్
ABN , Publish Date - Nov 26 , 2026 | 07:32 PM
బాలీవుడ్ నటుడు రవి కిషన్‌కు సంబంధించిన పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు రవి కిషన్‌కు సంబంధించిన పలు రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో చాలా వరకు ఫన్నీగా ఉంటాయి. అవి చూసి తాను కూడా నవ్వుకుంటానని గతంలో రవి కిషన్ చెప్పారు. అయితే వీటిలో తనకు అన్నింటి కంటే ఎక్కువ నవ్వు తెప్పించిన రూమర్ గురించి ఆయన తాజాగా ప్రస్తావించారు. ‘నాపై నడిచిన చాలా రూమర్లను నేను వింటూ, నవ్వుతూ ఉంటాను. అయితే మునుపు ఒక రూమర్ నా చెవిన పడింది. అది విని నేను పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నా. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనే ముందు నేను 20 లీటర్ల పాలతో స్నానం చేశానట. ఆ పాలల్లో గులాబీ పూల రేకులూ వేసుకున్నానట. ఇది వినగానే నాకు నవ్వు తన్నుకొచ్చింది’ అని రవి కిషన్ తెలిపారు.
కాగా నటి మాధురీ దీక్షిత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కోన్ హోనార్ కరోడ్‌పతి’ కార్యక్రమంలో పాల్గొన్న రవి కిషన్ ఈ విషయాలను పంచుకున్నారు. రేసు గుర్రం చిత్రంలో విలన్‌గా కనిపించిన ఆయన తెలుగువారికి సుపరిచితులే. ప్రస్తుతం రవి కిషన్ నటించిన ‘నాగ్జిల్లా’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇవీ చదవండి
తాజ్‌మహల్ వద్ద షాకింగ్ సీన్.. కోతుల నిర్వాకం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
వృద్ధాప్యంలో చిగురించిన ప్రేమ.. ఆశ్రమంలో ఒక్కటైన రెండు మనసులు