ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు రూ.5లక్షల ఫైన్
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:30 PM
హార్న్ కొట్టి, ఒక ఎలుగుబంటిని నిద్ర లేపినందుకు ఓ వ్యక్తికి రూ.5లక్షల ఫైన్ పడింది. ఎందుకంటారా?
ఇంటర్నెట్ డెస్క్: నార్వేలో ఒక ఎలుగుబంటి నిద్రకు భంగం కలిగించినందుకు ఓ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆ దేశానికి చెందిన స్వాల్‌బార్డ్‌లోని ద్వీపసమూహంలో అరుదైన ధృవపు ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటిని కాపాడుకోవడానికి నార్వే ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ మధ్య అక్కడకు ఓడలో వచ్చిన ఓ టూరిస్ట్.. హాయిగా నిద్రిస్తున్న ఎలుగుబంటిని అత్యుత్సాహంతో ‘ఫాగ్ హార్న్’ కొట్టి నిద్ర లేపారు. ఆ శబ్దానికి భయపడి అది పారిపోయింది. ఈ విషయం నార్వే ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అందుకే అతడికి అక్షరాలా ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది.
కేవలం హార్న్ కొట్టినందుకు ఫైన్ వేస్తారా? అనే డౌటు రావచ్చు కానీ.. ఫాగ్ హార్న్ భయంకర శబ్దాలను విడుదల చేస్తుంది. ఓడలు ఒకదానితో మరొకటి ఢీకొట్టకుండా ఉండేందుకు ఈ హార్న్ వాడతారు. ఇది వందల మైళ్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ శబ్ద తరంగాలకు జంతువులు భయపడి పారిపోతాయి. ఈ క్రమంలో అవి బాగా నీరసించి చనిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది.
ఈ వార్తలూ చదవండి
గోల్ఫ్ బంతులు మింగేసిన పాము.. కాపాడిన వైద్యులు.. వీడియో వైరల్
కొండచిలువలను వేటాడే రోబో కుందేళ్లు.. ఫ్లోరిడాలో కొత్త టెక్నాలజీ