కాలు లేకున్నా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:08 PM
అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. భక్తులు పోటెత్తారు. పర్వతాల మధ్య క్లిష్టమైన మార్గంలో రోజుల తరబడి సాగే ఈ యాత్ర కోసం.. ఓ మహిళ కృత్రిమ కాలితో బయల్దేరింది.
ఇంటర్నెట్ డెస్క్: అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. భక్తులు పోటెత్తారు. పర్వతాల మధ్య క్లిష్టమైన మార్గంలో రోజుల తరబడి సాగే ఈ యాత్ర కోసం.. ముందే పేరు నమోదు చేసుకోవాలి. వాతావరణం ఎప్పుడూ ఎలా మారుతుందో తెలియదు. అందుకే ఈ యాత్రకు చిన్నారులు, వృద్ధులకు అనుమతి ఉండదు. అలాంటి ఈ యాత్ర చేపట్టేందుకు ఓ మహిళ కృత్రిమ కాలితో బయల్దేరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె స్ఫూర్తికి నెటిజన్లు సెల్యూట్ చేస్తూ, ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కృత్రిమ కాలితో యాత్ర చేపట్టిన ఆ మహిళ పేరు నేహా భట్టా. యాత్రలో భాగంగా ఇప్పటికే ఆమె బల్తాల్ మార్గాన్ని పూర్తి చేశారు. గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె.. కృత్రిమ కాలితోపాటు రెండు చేతికర్రల సాయంతో కఠినమైన మార్గంలో నడవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అత్యవసరం సాయం కోసం నేహాకు తోడుగా మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఈ వీడియోను నేహా.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ampu_tea_nehaa’ పంచుకున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. వేలాది మంది లైక్ చేశారు. పెద్ద సంఖ్యలో ఈ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. నేహా ముఖంలో చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉందని అన్నారు. ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ యాత్ర చేస్తూ ఆమె ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పలువురు కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More Viral News And Telugu News