Share News

తాజ్ మహల్‌‌నూ వదల్లేదుగా.. ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..

ABN , Publish Date - Jun 05 , 2026 | 08:48 PM

మండిపోతున్న ఎండల్లో తాజ్ మహల్ ప్రాంగణంలో కోతులు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజ్ మహల్‌‌నూ వదల్లేదుగా.. ఈ కోతులు ఏం చేశాయో చూస్తే..
Monkeys at Taj Mahal

ఇంటర్నెట్ డెస్క్: మండిపోతున్న ఎండల్లో తాజ్ మహల్ ప్రాంగణంలో కోతుల నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని కోతులు.. అక్కడి వాటర్ ఫౌంటెన్‌ను తమ ఈత కొలనుగా మార్చేసుకున్నాయి. ఫౌంటెన్‌ నీటిలో దూకుతూ, ఒకదానినొకటి తరుముకుంటూ అవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్‌ను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులు ఈ కోతుల నిర్వాకం చూసి అవాక్కయ్యారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోపై సంబంధిత పురావస్తు శాఖ అధికారులు స్పందించారు.


కోతులు స్నానాలు చేస్తూ అల్లరి చేసింది తాజ్ మహల్ ప్రధాన ఫౌంటెన్‌లో కాదని అధికారులు స్పష్టం చేశారు. అది మసీదుకు సమీపంలో భక్తులు ప్రార్థనలకు (నమాజ్) ముందు కాళ్లు, చేతులు శుద్ధి చేసుకునే ‘వజూ’ (Wazu) కుండం అని వారు వెల్లడించారు. ఈ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారు, ఆ సమయంలో అక్కడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అనే విషయాలపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తాజ్ మహల్ సీనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఖలందర్ తెలిపారు.


ఇవి కూడా చదవండి

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యార్.. బీసీసీ నుంచి పిలుపు!

భీమిలిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు యువకుల అరెస్ట్

Updated Date - Jun 05 , 2026 | 09:34 PM